రంగ్ దే బసంతి
ఉపోద్ఘాతం:
భారతీయ సినిమాను వర్గీకరించడం అంత సులభమైన పనేమీ కాదు. సౌలభ్యం కోసం వాణిజ్య ప్రధాన (మెయిన్ స్ట్రీం కమర్షియల్) సినిమా, కళాత్మక సినిమా అనే రెండు రకాలుగా విభజించుకోవచ్చు గాని.. ఈ రెంటికీ మధ్య స్పష్టమైన గీత గీయడం రాన్రానూ కష్టమౌతోంది. ప్యూర్ ఆర్ట్ హౌస్ సినిమాలను పక్కన పెడదాం ప్రస్తుతానికి. అంటే సత్యజిత్ రే, ఆడూర్ గోపాల కృష్ణన్, బి.నర్సింగ రావు లాంటి వాళ్ళ సినిమాలన్నమాట. థియేటర్లలో రిలీజయ్యి సగటు ప్రేక్షకుని ముందు నిలిచే మెయిన్ స్ట్రీం సినిమాలను అయిదు రకాలుగా విభజించవచ్చని నేను అనుకుంటున్నాను.
మొదటి రకం పూర్తి వినోద ప్రధానమైనవి.. అంటే హిందీలో గోవిందా, తెలుగులో రాజేంద్ర ప్రసాద్, ఇవివి సత్యనారాయణ, ఒకప్పటి విఠలాచార్య సినిమాలు, హాలీవుడ్లో జిమ్ క్యారీ, మైక్ మయర్స్ సినిమాలు, ఇంకా జేమ్స్ బాండ్, సూపర్ మ్యాన్, బాట్ మ్యాన్ తరహా సినిమాలూ...ఇలాంటివన్నమాట.
ఒక వైపు వినోదాన్ని ఇస్తూ, వాణిజ్య విలువలు కోల్పోకుండా, అంతర్లీనంగా కాస్తో కూస్తో సందేశాన్ని ఇచ్చేవి రెండో రకం. మూడో రకం.. కొద్ది శాతం వినోదం, అధిక శాతం కథా ప్రధానమైనవి. పితామగన్ లాంటి సినిమాలు.
ఆద్యంతం వినోదం, కథ, కథనాలు పెనవేసుకుపోయి అన్ని రకాలుగా ప్రేక్షకున్ని రంజింపజేసేవి నాలుగో రకం. అంటే కె.విశ్వనాథ్ శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం లాంటివన్నమాట. అయిదో రకం పూర్తిగా కథా ప్రధానమైన, సీరియస్ సినిమాలు. ఈ రకానికి చెందినవి వినోదానికి ప్రాధాన్యం ఇవ్వకుండా పూర్తిగా సీరియస్గా సాగుతూ చెప్పదలచుకున్న విషయం మీదే కేంద్రీకృతమౌతాయి. అలా అని వీటిని పూర్తి ఆర్ట్ సినిమాలు అనలేము. ఎందుకంటే ఇవి కథా ప్రధానమైనప్పటికీ, కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటాయి... ఉదాహరణకు హిందీలో శూల్.
నాలుగు, ఐదు రకాల సినిమాలు రూపొందించడం నిజంగా సాహసంతో కూడుకున్న పని.. కనీసం భారతీయ మెయిన్ స్ట్రీం సినిమాకు సంబంధించినంతవరకు. ఎందుకంటే వాణిజ్య విలువలు లేని మెయిన్ స్ట్రీం సినిమా జయాపజయాలు నిజంగా దైవాధీనాలు. తాము పెట్టే ప్రతి రూపాయకూ తగ్గ వినోదాన్ని పొందాలని ఆశించే ప్రేక్షకుల సంఖ్య, సినిమాను ఒక కళగా చూసి, ఆదరించే ప్రేక్షకులతో పోలిస్తే చాలా ఎక్కువ. అలాంటప్పుడు సినిమాను ఒక సృజనాత్మక, ప్రయోగాత్మక మాధ్యమంగా నమ్మి రూపొందించాలంటే చాలా నిజాయితి, సాహసం కావాలి. అలా అని సీరియస్ మెయిన్ స్ట్రీం సినిమా విజయవంతం కాకూడదని ఏమీ లేదు. దర్శకుడు కావాలని చొప్పించకపోయినా, కథ, కథనాలలో నవ్యతో, విలక్షణతో, మరింకేదో ప్రత్యేకతవలనో కొన్ని సీరియస్ సినిమాలు కూడా సగటు ప్రేక్షకునికి సైతం నచ్చుతాయి. ప్రేక్షకుడు ఒక సినిమాలోని అంశాలను తన నిజ జీవతంలో గాని, భావనా ప్రపంచంలో గాని, పోల్చుకోగలిగి, నమ్మగలిగితే ఆ సినిమా విజయం పొందే అవకాశాలు ఎక్కువ. సినిమా కథ, కథనాలతో ప్రేక్షకుడు మమేకమైనపుడు ఆ సినిమాలో వాణిజ్య విలువలు ఉన్నాయా, లేవా అన్న విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. టాం హాంక్స్ నటించిన ఫిలడెల్ఫియా దీనికో ఉదాహరణ.
పైన చెప్పిన ఐదో రకానికి చెందిన సినిమా రంగ్ దే బసంతి.
******************* ఇంకా ఉంది *************************
కథ:
నటన:
సంగీతం:
సాంకేతిక అంశాలు:
చివరగా...
హిందీ సినిమా రూపురేఖలు మారిపోతున్నాయి.

0 Comments:
Post a Comment
<< Home